kcr: కేసీఆర్ అబద్ధాలపై ‘కేసీఆర్ అనే నేను’ పేరుతో సినిమా తీస్తా: పొన్నం ప్రభాకర్

  • ప్లీనరీ కోసం టెన్త్ ఫలితాలు విడుదల చేసే సమయం మారుస్తారా?
  • టీఆర్ఎస్ ప్లీనరీ ..అబద్ధాల, భజన వేదిక
  • కేసీఆర్ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏం సాధిస్తారు?
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్లీనరీ కోసం పదో తరగతి ఫలితాలు విడుదలు చేసే సమయం మారుస్తారా? అని ప్రశ్నించారు.

‘టీఆర్ఎస్ ప్లీనరీ ప్రగతి ప్రాంగణం కాదు..అధోగతి చేసే ప్రాంగణం, అది అబద్ధాల, భజన వేదిక’ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కేసీఆర్ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఆయన అబద్ధాలపై ‘కేసీఆర్ అనే నేను’ పేరుతో సినిమా తీస్తామంటూ పొన్నం ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
kcr
Ponnam Prabhakar

More Telugu News