vijay mallya: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాను.. విజయ్‌ మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు

  • లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టుకి మాల్యా హాజరు
  • ఓటు హక్కు వినియోగించుకోవడం తన ప్రాథమిక హక్కని వ్యాఖ్య
  • గతంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాను
భారతీయ బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఈ రోజు విచారణ నిమిత్తం లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టుకి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం తన ప్రాథమిక హక్కు అని, కానీ తాను లండన్‌ నుంచి భారత్‌కు వెళ్లలేనని అన్నారు.

గతంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని, కానీ తనకు ఇప్పుడు ఆ గౌరవం లేదని చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా, వచ్చేనెల కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 
vijay mallya
Karnataka
elections

More Telugu News