Chandrababu: ఇకపై ఇద్దరం కలసి పని చేస్తాం: అఖిలప్రియ

  • ఆళ్లగడ్డ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టిన చంద్రబాబు
  • అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య కుదిరిన రాజీ
  • ఇకపై కలసి పనిచేస్తామన్న ఆళ్లగడ్డ నేతలు
ఆళ్లగడ్డ పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. మంత్రి అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిలను పిలిపించుకుని మాట్లాడిన ఆయన... ఇద్దరికీ సయోధ్య కుదిర్చారు. విభేదాలను వీడి, కలసి పని చేయాలని సూచించారు.

అనంతరం మీడియాతో అఖిలప్రియ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని చెప్పారు. తమ కుటుంబానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని అన్నారు. ఇకపై ఆళ్లగడ్డలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చూసుకుంటామని చెప్పారు. ఏపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాలతో అందరం కలసి, పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తామని అన్నారు
Chandrababu
akhilapriya
av subbareddy

More Telugu News