Gorantla Butchaiah Chowdary: సోము వీర్రాజు పైరవీల చిట్టా మొత్తం మా వద్ద ఉంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • వార్డు మెంబర్ గా కూడా గెలిచే సత్తా లేదు
  • జాతీయ నాయకుడిగా ఊహించుకుంటున్నారు
  • కేంద్రం, రాష్ట్రానికి మధ్య శకునిలా తయారయ్యారు
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ వార్డ్ మెంబర్ గా కూడా గెలవగలిగే సత్తా లేని సోము వీర్రాజు... తానొక జాతీయ నేతనని ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పైరవీలు చేయడంలో వీర్రాజు దిట్ట అని... ఆయన పైరవీల చిట్టా మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వీర్రాజు ఒక శకునిలా తయారయ్యారని మండిపడ్డారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారయిందని తెలుస్తోంది. 
Gorantla Butchaiah Chowdary
somu veerraju

More Telugu News