YSRCP: విచారణ జరుగుతుంటే సర్టిఫికెట్లా.. ఆయనో బుద్ధిలేని కేంద్రమంత్రి!: రాందాస్ అథవాలేపై వర్ల రామయ్య విమర్శలు

  • కేంద్రమంత్రి రాందాస్ అథవాలేపై విరుచుకుపడిన వర్ల
  • రాష్ట్ర రాజకీయాల్లోకి జేబు దొంగలు
  • హోదా ఇచ్చి మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తామన్న నేత
వైసీపీ అధినేత జగన్ మంచోడంటూ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతున్న వేళ ఆయనకు క్లీన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇలా చేయడం న్యాయస్థానాలను ప్రభావితం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి అథవాలేకు బుద్ధి, అవగాహన రెండూ లేవని దుమ్మెత్తి పోశారు. టీడీపీ మళ్లీ ఎన్డీయేలోకి రావాలన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నింటినీ నెరవేరిస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జేబులు కొట్టేసే దొంగలు రాష్ట్ర రాజకీయాల్లోనూ తయారయ్యారని, అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి రామయ్య హెచ్చరించారు.
YSRCP
Jagan
Telugudesam
varla Ramaiah

More Telugu News