Rahul Gandhi: రాహుల్ విమానంలో సాంకేతిక లోపం!

  • ఢిల్లీ నుంచి హుబ్లీకి ప్రయాణించిన విమానంలో లోపం
  • ల్యాండింగ్ కూడా సవ్యంగా కాలేదు
  • కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసిన ‘కాంగ్రెస్’ నేతలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ఈరోజు ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపంతో తలెత్తడమే కాకుండా ల్యాండింగ్ కూడా సవ్యంగా కాలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కర్ణాటక పోలీస్ చీఫ్ నీల్ మణి ఎ. రాజు మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. కాగా, రాహుల్ కు ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాల గురించి ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ ఫిర్యాదు విషయమై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కు పోలీసులు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది.
Rahul Gandhi
Karnataka

More Telugu News