Pawan Kalyan: ఆ కవితలో నాకు ఇష్టమైన కొన్ని వాక్యాలు ఇవి!: పవన్ కల్యాణ్

  • కుంభవృష్టి కురిపించే..దుర్ధర్ష ప్రచండాబ్ద..’ అంటూ సాగిన కవిత
  • ఓ పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్
  • ఆ కవి, కవిత పేర్లను ప్రస్తావించని వైనం
కవులు..వారి కవితలు, రచయితలు.. వారి రచనల గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తరచుగా ప్రస్తావిస్తు ఉంటారు. గుంటూరు శేషేంద్ర శర్మ రచన ‘ఆధునిక మహా భారతం’ గురించి పవన్ ఎన్నోసార్లు ప్రస్తావించారు కూడా. తనకు స్ఫూర్తి నిచ్చిన కొటేషన్స్ ను సైతం నోట్ చేసుకునే పవన్, తాజాగా ఓ పోస్ట్ చేశారు. ఒక తెలుగు కవి రాసిన కవితలోని తనకు ఇష్టమైన కొన్ని వాక్యాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఈ పోస్ట్ చేశారు. ‘కుంభవృష్టి కురిపించే..దుర్ధర్ష ప్రచండాబ్ద..’ అంటూ ఈ కవిత సాగింది. కాగా, ఆ కవి, కవిత పేర్ల గురించి పవన్ ప్రస్తావించలేదు.
 

Pawan Kalyan

More Telugu News