vivekananda reddy: ముగిసిన ఆనం వివేకానంద రెడ్డి అంత్యక్రియలు

  • పెన్నానది ఒడ్డున ఉన్న బోడిగాడి తోట వద్ద అంత్యక్రియలు
  • అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికిన నేతలు
  • తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
ప్రోస్టేట్ కేన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంకాలం నెల్లూరులోని పెన్నానది ఒడ్డున ఉన్న బోడిగాడి తోట వద్ద ముగిశాయి. అశ్రునయనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయనతో గడిపిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.           
vivekananda reddy
Andhra Pradesh
Nellore District

More Telugu News