Narendra Modi: చైనా బయలుదేరిన మోదీ.. రేపు, ఎల్లుండి జిన్‌పింగ్‌తో చర్చలు

  • జిన్‌ పింగ్‌ ఆహ్వానంతో చైనాకు మోదీ
  • చైనాలోని హుబీ ప్రావిన్సులో భేటీ
  • ఇరు దేశాల సత్సంబంధాల బలోపేతంపై జరగనున్న చర్చలు
అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు బయలుదేరారు. రేపు, ఎల్లుండి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం కానున్నారు. చైనాలోని హుబీ ప్రావిన్సులోని వుహన్‌ నగరంలో ఇరు దేశాల అగ్రనేతల మధ్య అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మోదీ, జిన్‌ పింగ్‌ భేటీలో ముఖ్యంగా అంతర్జాతీయ సమస్యలు, భారత్‌, చైనా సత్సంబంధాల బలోపేతం, వివాదాస్పద అంశాల పరిష్కారాలపై చర్చలు జరగనున్నాయి.

భారత్‌, చైనాల మధ్య డోక్లాంలో గతంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో ఇరు దేశాల సత్సంబంధాలు మరింత దిగజారిన విషయం తెలిసిందే. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న ఇతర సమస్యలకు ఈ భేటీతో పరిష్కారం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
Narendra Modi
China
India

More Telugu News