Jagan: అందుకే మోదీకి జగన్‌ భయపడుతున్నారు: వర్ల రామయ్య

  • మోదీని విమర్శించకుండా చంద్రబాబుని విమర్శిస్తున్నారు
  • మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయం
  • జగన్ కేసుల గురించి ఏం తెలుసని అథవాలే మాట్లాడారు?
ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. జగన్‌.. మోదీని విమర్శించకుండా చంద్రబాబుని విమర్శిస్తున్నారని విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని ఆయన అన్నారు.

ఈ రోజు ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీలోని బీజేపీ నేతలను వైసీపీలో చేర్చుకోవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. ఇటీవల జగన్‌కు ఫోన్ చేసి చెప్పిన విషయం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

కాగా, వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్న విషయంపై వర్ల రామయ్య స్పందిస్తూ.. జగన్ కేసుల గురించి ఏం తెలుసని ఆయన అలా మాట్లాడారని విమర్శించారు. 
Jagan
varla ramaiah
Telugudesam

More Telugu News