Mahesh Babu: మహేశ్ బాబు నటన అద్భుతం: వెంకటేశ్

  • మహేశ్ బాబు చాలా బాగా చేశాడు 
  • కొరటాల గొప్పగా తీశారు
  • నిర్మాత దానయ్యకు అభినందనలు
కొరటాల శివ ..మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో సహజంగానే 'భరత్ అనే నేను' సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో కొరటాల .. మహేశ్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అలాంటివారి జాబితాలో తాజాగా వెంకటేశ్ కూడా చేరిపోయారు. "భరత్ అనే నేను' సినిమా చూశాను .. మహేశ్ బాబు అద్భుతంగా నటించాడు. సున్నితమైన కథా వస్తువును కొరటాల చాలా అందంగా .. బలంగా .. అభినందించదగిన రీతిలో చెప్పారు. ఇంతమంచి సినిమాను నిర్మించిన దానయ్యకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు" అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలా ప్రముఖుల ప్రశంసలతో .. భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది.     
Mahesh Babu
kiaraadvani

More Telugu News