Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసుల నమోదు

  • మీడియా కథనాలను వక్రీకరిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు
  • పాత్రికేయ సంఘాల ఫిర్యాదు మేరకు కేసుల నమోదు
  • ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసులు
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కొంత కాలంగా పవన్ కల్యాణ్... మీడియా కథనాలను వక్రీకరిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై పోలీసులు ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 బంజారా హిల్స్‌ పోలీసులకు ఇటీవల పాత్రికేయ సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు పలు ఆధారాలను సమర్పించినట్లు తెలిసింది. కాగా, తప్పుడు ప్రచారంతో పాటు మీడియా అధినేతలను లక్ష్యంగా చేసుకుని పవన్ కల్యాణ్‌ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News

Pawan Kalyan
Police
Hyderabad
Jana Sena