Virat Kohli: విరాట్ కోహ్లీకి 12 లక్షల జరిమానా!

  • స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా
  • జరిమానా విధించినట్టు ప్రకటించిన ఐపీఎల్ మేనేజ్ మెంట్
  • ఈ మ్యాచ్ లో బెంగళూరుపై చెన్నై ఘన విజయం
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ మేనేజ్ మెంట్ భారీ జరిమానా విధించింది. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు నమోదు కావడంతో కోహ్లీపై రూ. 12 లక్షల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమని... అందుకే జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది.

నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నైకు బెంగళూరు జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ... ఆ తర్వాత పుంజుకున్న చెన్నై జట్టు చివరకు ఘన విజయం సాధించింది. 
Virat Kohli
fine
ipl

More Telugu News