ఆ సంగీత దర్శకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు: సుద్దాల అశోక్ తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సంగీత దర్శకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు: సుద్దాల అశోక్ తేజ

  • రాత్రంతా కూర్చుని 60 పల్లవులు వ్రాయమన్నాడు 
  • 40కి మించి వ్రాయలేకపోయాను 
  • చూడకుండానే పక్కన పడేశాడు  
మనసును కదిలించే .. మనసును కరిగించే పాటలు రాయడంలో సుద్దాల అశోక్ తేజ సిద్ధహస్తుడు. అలాంటి సుద్దాల అశోక్ తేజ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో తనకి ఎదురైన ఒక సంఘటన గురించి ప్రస్తావించారు. "నా కెరియర్ ఆరంభమైన కొత్తలో ఒక ప్రముఖ సంగీత దర్శకుడికి ఒక దర్శకుడు నన్ను పరిచయం చేశారు. ఆ సినిమాకి నేను పాటలు రాయడం ఆ సంగీత దర్శకుడికి ఇష్టం లేదు .. అలాగని దర్శకుడి మాట కాదనలేడు.

 "నా మూడ్ బాగోలేదు .. ఈ రాత్రంతా కూర్చుని 60 పల్లవులు వ్రాయి. పొద్దుటే నేను వచ్చి చూస్తాను .. నాకు నచ్చితే ఒక ట్యూన్ ఇస్తాను. ఆ ట్యూన్ కి మళ్లీ నువ్వు 60 పల్లవులు వ్రాస్తే నచ్చింది తీసుకుంటాను' అన్నాడు. రాత్రంతా కూర్చుని వ్రాసినా 40కి పైగా మాత్రమే వ్రాయగలిగాను. పొద్దుటే వెళ్లి చూపిస్తే 60 వ్రాయమన్నాను కదా? అంటూ .. చూడకుండానే పక్కన పడేశాడు" అంటూ చెప్పుకొచ్చారు.       
suddala ashok teja

More Telugu News