Nara Lokesh: జగన్, పవన్ లపై మండిపడ్డ నారా లోకేశ్
వైసీపీ, జనసేన పార్టీల అధినేతలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెబుతున్న జగన్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైసీపీ రాజీనామాలు చేసి ప్రజలకు పంగనామాలు పెడుతోందని, డ్రామాలాడుతోందని విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకూ తమ పోరాటం ఆగదని చెబుతున్న జగన్ కు ప్రధాని మోదీని విమర్శించే దమ్ముందా? అని ప్రశ్నించారు. జనసేనాని పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. తనపై పవన్ చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, ఆధారాలుంటే నిరూపించాలని, నీచరాజకీయాలు చేసే చరిత్ర టీడీపీది కాదని లోకేశ్ అన్నారు.