av subbareddy: రాళ్ల దాడి ఘటనతో భూమా కుటుంబంతో సత్సంబంధాలు తెగిపోయినట్లే!: ఏవీ సుబ్బారెడ్డి

  • అధిష్ఠానం ఏది చెబితే అది పాటించేందుకు సిద్ధంగా ఉన్నాను
  • అధిష్ఠానం సూచన మేరకే నేను సైకిల్ యాత్ర చేశాను
  • ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇటీవల జరిగిన రాళ్ల దాడి ఘటన అలజడి రేపిన విషయం తెలిసిందే. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై కొందరు రాళ్ల దాడి చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజు ఈ విషయంపై నిర్వహించతలపెట్టిన భేటీ వాయిదా పడింది. అనంతరం ఏవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాళ్ల దాడి ఘటనతో భూమా కుటుంబంతో సత్సంబంధాలు తెగిపోయినట్లు భావిస్తున్నానని అన్నారు.

తమ పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అది పాటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. రాళ్ల దాడి జరిగిన రోజున కూడా తాను అధిష్ఠానం సూచన మేరకే సైకిల్ యాత్ర చేశానని చెప్పారు. ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. 
av subbareddy
akhila priya
Chandrababu
Telugudesam

More Telugu News