Telugudesam: నేను వైసీపీలో చేరుతున్నాననేది అవాస్తవం: ఏవీ సుబ్బారెడ్డి

  • తండ్రి సమానమైన నాపై అఖిలప్రియ కావాలనే దాడి చేయించింది
  • అధిష్ఠానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానన్నా 
  • సీఎంఓ నుంచి పిలుపు రాలేదని అఖిల ప్రియ చెప్పడం అబద్ధం
తాను వైసీపీలో చేరుతున్నాననేది అవాస్తవమని కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కాగా, మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న వివాదం విషయమై మాట్లాడే నిమిత్తం అమరావతికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడు వారిని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో విజయవాడ చేరుకున్న ఏవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు రాలేదని అఖిల ప్రియ చెబుతుండటం అబద్ధమని అన్నారు. ఆళ్లగడ్డలో తాము సైకిల్ ర్యాలీ నిర్వహిస్తుంటే, తండ్రి సమానమైన తనపై అఖిలప్రియ కావాలనే దాడి చేయించిందని ఆరోపించారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానన్నానే తప్ప, తనకు తానుగా పోటీ చేస్తానని చెప్పలేదని అన్నారు. 
Telugudesam
av subba reddy

More Telugu News