veera machinenei ramakrishna: నా డైట్ తో కిడ్నీలు పాడైపోతాయని నిరూపిస్తే జైలుకెళ్లేందుకు నేను సిద్ధం: వీరమాచనేని

  • ‘లో కార్బ్ - హై ఫ్యాట్’ డైట్ ప్లాన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • డయాబెటిక్ అనేది దగ్గు, జలుబు లాంటిదే
  • మధుమేహం పేరిట వైద్యులు దోచుకుంటున్నారు!
  • దమ్ముంటే ఈ డైట్ విషయమై చర్చకు రావాలి
‘లో కార్బ్ - హై ఫ్యాట్’ డైట్ పేరిట మధుమేహ వ్యాధికి కొత్త చికిత్సా విధానాన్ని వీరమాచనేని రామకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా డైట్ ను అనుసరించడం ద్వారా అధిక బరువు, బీపీ, షుగర్, ఇతర రోగాల నుంచి బయటపడొచ్చని ఆయన చెబుతుండటం విదితమే.

అయితే, ‘లో కార్బ్ - హై ఫ్యాట్’ డైట్ మంచిది కాదని వైద్యులు చెబుతుండటాన్ని వీరమాచనేని సవాల్ చేస్తున్నారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వీరమాచనేని మాట్లాడుతూ, తాను సూచించిన డైట్ ప్లాన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని, డయాబెటిక్ అనేది దగ్గు, జలుబు లాంటిదేనని అన్నారు.

డయాబెటిస్ పేరిట వైద్యులు దోచుకుంటున్నారని, కొంతమంది డాక్టర్లు ప్రజలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తన డైట్ ను పాటించే వారి కిడ్నీలు పాడవుతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని నిరూపిస్తే తాను జైలు కెళ్లడానికి సైతం సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే.. తన డైట్ విషయమై చర్చకు రావాలని వీరమాచనేని సవాల్ విసిరారు.
veera machinenei ramakrishna
low carb - high fat

More Telugu News