youtube: పోస్ట్ చేసిన వెంటనే 50 లక్షల వీడియోలను డిలీట్ చేసేసిన యూట్యూబ్

  • ఎవరూ చూడకముందే తొలగింపు
  • చూసిన వీడియోల్లో 19 లక్షలు డిలీట్
  • మరింత నిఘాతో వ్యవహరిస్తామని ప్రకటన
యూట్యూబ్ సంస్థ 2017 చివరి మూడు నెలల కాలంలో ఏకంగా 50 లక్షల వీడియోలను తన ప్లాట్ ఫామ్ నుంచి తొలగించేసింది. కంటెంట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పోస్ట్ చేసిన వెంటనే సాఫ్ట్ వేర్ వాటిని గుర్తించి డిలీట్ చేసింది. వీటిని ఒక్కరు కూడా చదవకుండానే డిలీట్ చేయడం జరిగింది.

ఇక గూగుల్ కార్యాలయంలోని మానవ నిఘా బృందం అప్పటికే వీక్షకులు చూసిన 19 లక్షల అభ్యంతరకర  వీడియోలను తొలగించింది. ఇకపైనా మరింత నిఘాతో వ్యవహరిస్తామని యూట్యూబ్ సంస్థ స్పష్టం చేసింది. వాస్తవానికి యూట్యూబ్ అనుచిత కంటెంట్ కు వేదికగా నిలవడంపై చాలా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సంస్థ ఇటీవల సాఫ్ట్ వేర్ సాయంతో మరిన్ని నియంత్రణలను అమల్లో పెట్టింది.
youtube
vedios

More Telugu News