భారతీయులకు భారీగా తగ్గిపోయిన హెచ్1బీ వీసాలు
- భారత ఐటీ కంపెనీలకు గతేడాది లభించినవి 8,468 వీసాలే
- 2015లో ఈ సంఖ్య 14,792
- 43 శాతం తగ్గుదల
టీసీఎస్ కంపెనీకి 2017లో 2,312 వీసాలు మంజూరయ్యాయి. 2015లో మాత్రం 4,674 వీసాలు లభించాయి. ఇన్ఫోసిస్ కు ఇదే కాలంలో 57 శాతం తగ్గాయి. 2,830 నుంచి 1,218కి తగ్గిపోయాయి. ఇలా ఏడు భారతీయ ఐటీ కంపెనీలకు సంబంధించిన వీసాల అనుమతుల్లో ఒక్క టెక్ మహింద్రాకు మాత్రం గతేడాది అధికంగా వీసాలు లభించాయి. 2015లో 1,576 మంజూరు కాగా, 2017లో 2,233 లభించాయి.