Manchu Vishnu: తనకు, ప్రగ్యా జైస్వాల్ కు యాక్సిడెంట్ ఎలా అయిందో చూపించిన మంచు విష్ణు... వీడియో విడుదల!

  • 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ లో ప్రమాదం
  • ఫైట్ సీన్ లో స్కిడ్ అయిన బైకులు
  • వీడియోను యూట్యూబ్ లో పెట్టిన విష్ణు
'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ లో భాగంగా, ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న వేళ, యాక్సిడెంట్ జరిగి హీరో మంచు విష్ణుకు తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది కూడా. తాజాగా, తనకు యాక్సిడెంట్ అయిన వీడియోను మంచు విష్ణు పోస్టు చేశాడు. తనకైన గాయాలను చూపించాడు.

యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ వీడియో మంచు ఫ్యామిలీ అభిమానులకు షాకిస్తోంది. బైక్ చేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్న వేళ, ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న మంచు విష్ణు, ప్రగ్యా ఇద్దరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విష్ణు చేతుల‌కి , భుజానికి పెద్ద గాయాలే అయ్యాయి. యాక్సిడెంట్ సమయంలో విష్ణు తలకు హెల్మెట్ లేదు. అయితే, అదృష్ట‌వ‌శాత్తు త‌లకు గాయాలు కాకపోవడంతో ఆయన త్వరగానే కోలుకున్నాడు. విష్ణు పోస్టు చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.
Manchu Vishnu
Achari Amerika Yatra
Road Accident
Shooting

More Telugu News