Tollywood: ఒకాయనపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నా: శ్రీరెడ్డి

  • పేరు చెప్పకుండా పోస్టు పెట్టిన శ్రీరెడ్డి
  • ఇకపై టాలీవుడ్ ను మార్చేందుకే పోరాటం
  • వ్యక్తిగత యుద్ధాలు చేయబోనని వెల్లడి
ఒకాయనపై తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నానని నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "ఇక మళ్ళీ మా నిరసనలు కొనసాగిస్తాం. మాకు ఎవరిపైనా ప్రత్యేకించి ఆగ్రహం లేదు. అయితే, ఒకాయన వ్యాఖ్యలతో, ప్రవర్తనతో బాధపడ్డాము. ఆయనపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నాను. ఇక నా పోరాటం టాలీవుడ్ చిత్ర పరిశ్రమను మార్చడంపైనే ఉంటుంది. ఇకపై వ్యక్తిగత యుద్ధాలుండవు. నాకన్నా, నా నిరసనలనే నేను ఎక్కువగా గౌరవిస్తున్నాను. కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించింది.

కాగా, ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు, శ్రీరెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ పేరును డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ, శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఉద్దేశించి చేసినవేనని ఈ పోస్టుకు సమాధానంగా వస్తున్న కామెంట్లలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Tollywood
Film Industry
Sri Reddy
Pawan Kalyan
Casting Couch

More Telugu News