Kanna Lakshminarayana: వైసీపీలో చేరనున్న వేళ అస్వస్థతకు గురైన కన్నా లక్ష్మీనారాయణ

  • బీపీ, షుగర్‌తో బాధపడుతున్న కన్నా 
  • నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం
  • అంతలోనే అస్వస్థత
బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా బీపీ, షుగర్‌తో బాధపడుతున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

బీజేపీలో నిన్నమొన్నటి వరకు కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న కన్నా పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ పడ్డారు. హరిబాబు రాజీనామాతో అది తనకు ఖాయమని నమ్మారు. అధిష్ఠానం కూడా తొలుత ఆయనకే ఇవ్వాలని భావించినా, పార్టీలోని సీనియర్లను కాదని, బయటి నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్ఠానం వెనక్కి తగ్గింది. దీంతో కినుక వహించిన కన్నా బీజేపీకి రాజీనామా చేశారు. నేడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అంతలోనే ఆయన అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు.
Kanna Lakshminarayana
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News