annapurna studios: అన్నపూర్ణ స్డూడియోస్ లో టాలీవుడ్ హీరోల సమావేశం

  • సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చ
  • అగ్రహీరో చిరంజీవి ఆధ్వర్యంలో సమావేశం
  • మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన వైనం 
సినీ పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలపై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే నిమిత్తం టాలీవుడ్ హీరోలు సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ విషయమై చర్చిస్తున్నారు. అగ్రహీరో చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ హీరోలు రాజశేఖర్, వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్, నాని, అల్లరి నరేష్ తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, నాగబాబు, సీనియర్ నరేష్, బీవీఎస్ఎస్ ప్రసాద్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణా హాజరైనట్టు సమాచారం.

కాగా, టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై చర్చించేందుకు గత శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడకుండా సినీ పెద్దలు వెళ్లిపోయారు.
annapurna studios
Tollywood
Chiranjeevi

More Telugu News