కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నాగం, ఆది శ్రీనివాస్, గద్దర్ కుమారుడు సూర్య

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు వీళ్లిద్దరూ కాంగ్రెస్ లో చేరతారు.

నాగం, సూర్యతో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆది శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ ముగ్గురిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కుంతియానే రాహుల్ వద్దకు తీసుకెళ్లనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి నాగం, సూర్య చేరితే తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతమవుతుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ లోకి నాగం రాకను అదే పార్టీకి చెందిన నేత దామోదర్ రెడ్డి వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
Go Back to Shorts
Telangana
Congress
gaddar son surya
ngam

More Telugu News