suddaramaiah: సిద్ధరామయ్యకు పోటీగా బరిలోకి దిగిన గాలి ప్రధాన అనుచరుడు

  • బాదామి నియోజకర్గంలో సిద్దూ వర్సెస్ బి.శ్రీరాములు
  • నేటితో ముగిసిన నామినేషన్ల ఘట్టం 
  • వేడెక్కిన కర్ణాటక ఎన్నికల చిత్రం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ రోజు నామినేషన్లకు తుది గడువు కావడంతో... అన్ని పార్టీల నేతలు తమ నామినేషన్లను దాఖలు చేసే కార్యక్రమాన్ని ముగించారు. ఈ క్రమంలో బాదామి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీగా గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, నమ్మినబంటు అయిన బి.శ్రీరాములు బీజేపీ తరపున నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి జవదేకర్, బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మురళీధరరావు తదితరులు శ్రీరాములు వెంట ఉన్నారు. సిద్దూ, శ్రీరాములు మధ్య పోటీ రసవత్తరంగా ఉండవచ్చని ప్రజలు అంటున్నారు.
suddaramaiah
b.sreeramulu
badami

More Telugu News