vijay devarakonda: సావిత్రిని తిట్టిన వారంతా మా వేడుకకి రండి!: విజయ్ దేవరకొండ

  • సావిత్రి చాలా మంచివారు 
  • ఎంతోమందికి సాయం చేశారు 
  • ఆమెను విమర్శించే వాళ్లు వేడుకకి రండి    
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి సావిత్రి జీవితం .. ఆమె వ్యక్తిత్వం గురించి తెలుసుకునే అవకాశం కలిగింది.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. "సావిత్రి మనసు చాలా సున్నితం .. ఆమె ఎవరికీ భయపడేవారు కాదు. కష్టాల్లో వున్నవారికి తనవంతు సాయం చేశారు. ఆమె ప్రేమించాలనుకున్నారు .. ప్రేమను పొందాలనుకున్నారు .. ఆ తరువాతే సూపర్ స్టార్ కావాలనుకున్నారు. సావిత్రి చాలా మంచివారు .. కానీ ఆమెను చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అలా ఆమెను తిట్టిన వాళ్లంతా నా దగ్గరికి వస్తే .. ఈ సినిమా ఆడియో లాంచ్ పాస్ లు ఇస్తాను. తనని విమర్శించిన వాళ్లు ఈ వేడుకకి వస్తే సావిత్రి ఆత్మ సంతోషిస్తుంది" అని అన్నాడు.
vijay devarakonda

More Telugu News