Jana Sena: ‘పీకే ఖబడ్దార్..’అంటూ పవన్ తీరుపై జర్నలిస్టుల నిరసన

  • హైదరాబాద్ లో జర్నలిస్టుల ఆందోళన
  • పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు 
  • ‘ఇది పవనిజం కాదు విలనిజం’ అంటూ జర్నలిస్టుల నిరసన
‘జనసేన’ అధినేత పవన్ తీరును నిరసిస్తూ హైదరాబాద్ లో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి చౌరస్తాలో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేబట్టారు. ప్లకార్డులు చేతబూనిన జర్నలిస్టులు పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘పీకే ఖబడ్దార్, ఇది పవనిజం కాదు విలనిజం...’ అంటూ పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఫిలిం చాంబర్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు ప్రవర్తించిన తీరు దారుణమని, మీడియా సంస్థ వాహనాలను ధ్వంసం చేయడం తగదని అన్నారు. 
Jana Sena
Hyderabad
journalists agitation

More Telugu News