keerthi suresh: సావిత్రి గొప్పతనాన్ని చాటిచెప్పే 'మహానటి'

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి'
  • ప్రధానమైన పాత్రలో కీర్తి సురేశ్ 
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల      
సావిత్రి .. కళ్లతోనే మాట్లాడుతుంది .. కనురెప్పల కదలికతోనే పాటలను పలికిస్తుంది. అందుకే సావిత్రి మరిచిపోలేని నటి అయింది .. మహానటి అయింది. అలాంటి సావిత్రి జీవితచరిత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను వచ్చేనెల 9వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత స్వప్నదత్ తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడారు. "సావిత్రి ఎంత గొప్ప నటీమణో .. అంతకన్నా మంచి మనసున్న వ్యక్తి. సావిత్రి మానవత్వానికి ప్రతీక .. ఎదుటివారి కష్టం చూసి వెంటనే కరిగిపోయేవారు. సావిత్రి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలను ఆమె కుటుంబసభ్యుల ద్వారా .. సన్నిహితులు .. సహ నటీనటుల ద్వారా తెలుసుకుని చూపించడం జరిగింది" అన్నారు. సమంత .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ .. షాలిని పాండే ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.       
keerthi suresh
samanta

More Telugu News