akkineni: అక్కినేని బయోపిక్ కి చకచకా సన్నాహాలు?

  • అక్కినేని జీవితంపై పరిశోధన పూర్తి 
  • యంగ్ ఏఎన్నార్ గా చైతూ 
  • ఆ తరువాత దశలో నాగ్
తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీ రామారావు .. అక్కినేని నాగేశ్వరరావు రెండుకళ్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఇద్దరూ కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల్లో అశేష ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ మహానటులలో ఎన్టీ రామారావు బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు మొదలైపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ కి సంబంధించిన పనులు కూడా సైలెంట్ గా మొదలైపోయాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితమే అక్కినేని జీవితానికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ మొదలైందనీ .. ఇప్పుడు చివరిదశకు చేరుకుందని అంటున్నారు. అక్కినేని సినిమా ప్రయత్నాలు మొదలు .. ఆయన అంతిమయాత్ర వరకూ ఈ బయోపిక్ లో ఉంటుందని చెబుతున్నారు. యంగ్ ఏఎన్నార్ గా చైతూ .. ఆ తరువాత దశలో ఏఎన్నార్ గా నాగ్ కనిపిస్తారని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.         
akkineni
Nagarjuna
chaitu

More Telugu News