Narendra Modi: ప్రధానిని లేపేస్తానన్న కోయంబత్తూరు పేలుళ్ల దోషి.. తాజాగా అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీని లేపేస్తామంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో.. ఆ ఆడియో క్లిప్ ఆధారంగా కోయంబత్తూరు వరుస బాంబుపేలుళ్ల కేసులో శిక్ష అనుభవించిన మహ్మద్ రఫీక్ ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... 1998లో కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 58 మంది మృతి చెందారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మహమ్మద్‌ రఫీక్‌ ని అరెస్టు చేసి నేరం నిరూపించారు.

దీంతో శిక్ష అనుభవించిన రఫీక్, ఆ తర్వాత విడుదలై తమిళనాడులోని కునియాముత్తూరు ప్రాంతంలో ట్రాన్స్‌ పోర్ట్‌ కాంట్రాక్టర్‌ గా స్థిరపడ్డాడు. ఇటీవల రఫీక్ మరొక వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాడు. 8 నిమిషాల ఆ సంభాషణలో తొలుత ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన వివరాలు మాట్లాడుకున్నారు. ఆ తరువాత 'మనం మోదీని చంపాలని అనుకుంటున్నాం. 1998లో ఎల్‌కే అద్వానీ పర్యటించిన సమయంలో కూడా మనమే బాంబులు పెట్టాం' అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ ఆడియో టేపు వెలుగు చూడడంతో సోషల్ మీడియాలో ఆ సంభాషణ వైరల్ గా మారింది. దీంతో నిందితుడు మహమ్మద్‌ రఫీక్‌ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, దీనిపై ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు
Go Back to Shorts
Narendra Modi
mohammad rafiq
koyambattore blasts culprit

More Telugu News