Chiranjeevi: రోజా టీడీపీలో ఉన్నప్పుడు చిరంజీవిని, పవన్ ను విమర్శించిన వీడియోను పోస్టు చేసిన నటి శ్రీరెడ్డి

  • చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై అప్పట్లో రోజా నిప్పులు
  • మహిళా నటులను చులకనగా చూస్తున్నారని విమర్శలు
  • ఇప్పుడెందుకు విమర్శించడం లేదని శ్రీరెడ్డి ప్రశ్న
ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా, మహిళా నేతగా ఉన్న సినీ నటి రోజా, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె మాట్లాడిన ఓ వీడియోను టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దాదాపు 30 సెకన్ల నిడివి వున్న ఈ వీడియోలో రోజా, అప్పట్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ లను ప్రస్తావిస్తూ, క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలున్నాయి. మహిళా నటులు అంత చులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించిన రోజా, వేషాలు ఇచ్చేందుకు ఎంతమందితో మీరు, మీ తమ్ముడు... అంటూ రెచ్చిపోయారు.

"అప్పట్లో టీడీపీలో ఉన్నప్పుడు రోజా గారు సూపర్. ఆమె డేరింగ్ కి నేను ఫిదా. కానీ ఈమధ్య ఏమైందో అర్థం కావట్లేదు. తెగ పొగిడేస్తున్నారు పీకేని. జై జగన్ అన్నా అని పొగిడితే చాలు" అని ఈ వీడియోకు శ్రీరెడ్డి తన కామెంట్ ను జోడించింది.
Chiranjeevi
Pawan Kalyan
sri Reddy
Roja
PRP
Telugudesam
YSRCP

More Telugu News