Pawan Kalyan: పవన్ మరో సంచలన ట్వీట్.. ఈసారి అందరూ బయటకు వస్తారన్న జనసేన చీఫ్!

  • వరుస ట్వీట్లతో పవన్ హెచ్చరికలు
  • ఈ దెబ్బతో అందరూ బయటకు వస్తారన్న పవన్
  • ఇది అంతిమంగా అమరావతి వైపు దారితీస్తుందని హెచ్చరిక
తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు, సీఈవో రవిప్రకాశ్‌పై విరుచుకుపడిన పవన్ ఆ తర్వాత కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాల్సిందిగా తెలంగాణ పోలీసులను అభ్యర్థించనున్నట్టు పవన్ పేర్కొన్నారు.

ఈ దెబ్బతో తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు, మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా అమరావతి వైపు దారి తీస్తుందంటూ సంచలన ట్వీట్ చేశారు. దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు, రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు.. అందరూ బయటకు వస్తారని పేర్కొన్నారు. సమాజంలోని కుళ్లు కూడా బయట పడుతుందన్నారు. ‘‘మీరందరూ కలిసి నడి రోడ్డుపై ఓ సోదరి బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని ‘షో’లకు అది కారణమైంది’’ అని పవన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
Tollywood
Telangana

More Telugu News