Pawan Kalyan: టీడీపీతో పవన్‌కు ప్రాణహాని: కాపునాడు సంఘం అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు

  • చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు కక్ష కట్టారు
  • మీడియా సంస్థలకు కోట్లాది రూపాయలు ఇచ్చి తిట్టిస్తున్నారు
  • పవన్‌కు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న మీడియా అనుచరుల ద్వారా పవన్‌కు ఏదైనా జరిగితే అందుకు టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

విజయవాడలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన టీడీపీ ప్రభుత్వ నాలుగేళ్ల వైఫల్యాలను పవన్ విమర్శించడం వల్లే చంద్రబాబు, లోకేశ్ కక్షగట్టారని అన్నారు. పవన్ విమర్శలను జీర్ణించుకోలేకే వెకిలి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలకు లోకేశ్ కోట్లాది రూపాయలు ఇచ్చి పవన్‌ను తిట్టిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు.
Pawan Kalyan
Telugudesam
Janasena

More Telugu News