Pawan Kalyan: గుడ్‌నైట్‌ చెప్పేముందు.. ఓ మీడియా సంస్థ అధినేత ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేసి కామెంట్ చేసిన పవన్‌ కల్యాణ్‌!

  • కొన్ని ఛానెళ్లపై పవన్ మండిపాటు
  • ఓ మీడియా సంస్థ అధినేతపై విమర్శలు
  • ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ట్వీట్లు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ప్రోత్సాహంతో తనపై యువనటి శ్రీరెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలని కొన్ని టీవీ న్యూస్‌ ఛానెళ్లు పదే పదే ప్రసారం చేశాయని మండిపడుతోన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆయా సంస్థల అధినేతలపై విమర్శల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ వీడియో ప్రసారం చేసి చిరాకు తెప్పించిన సదరు మీడియా ఛానెళ్లకు.. తమ పార్టీ అధినేత పవన్‌ కూడా అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ట్వీట్లు చేస్తూ చిరాకు తెప్పిస్తారని జనసేన కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు.

కాగా, ఈ రోజు గుడ్‌నైట్‌ చెప్పబోయే ముందు పవన్ కల్యాణ్‌ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అందులో ఓ మీడియా సంస్థ అధినేత కుటుంబ సభ్యులు ఉన్నారు. 'బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి..' అని ఆ ఫ్యామిలీ ఫొటోలో ఉన్న అబ్బాయికి చెబుతున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఆ తరువాత గుడ్‌నైట్‌ అని మరో ట్వీట్‌ చేశారు.

కాగా, ఈ ట్వీట్‌పై పవన్‌కు మద్దతు తెలుపుతూ 'జబర్దస్త్‌' నటులు కామెంట్లు చేస్తున్నారు. 'ఇంకోసారి ఇలాంటి పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాయాలన్నా భయపడాలి సర్.. విల్లు అలా చేయండి.. మీరు అయితేనే చేయగలరు' అని ఓ నటుడు కామెంట్‌ చేశాడు. 
Pawan Kalyan
Jana Sena
Hyderabad

More Telugu News