Ayyanna Patrudu: మాణిక్యాలరావుకు అయ్యన్నపాత్రుడి సూటి ప్రశ్న

  • మంత్రి పదవిలో ఉన్నప్పుడు అవినీతి కనిపించలేదా?
  • పదవి పోయిన తర్వాత కనిపిస్తోందా?
  • అవినీతిని నిరూపించండి.. రాజకీయాల నుంచి తప్పుకుంటాం
బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావుపై మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉన్నంత వరకు కనిపించని అవినీతి... మంత్రి పదవి పోయిన తర్వాత కనిపించిందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబితే కానీ మీకు అవినీతి కనిపించలేదా? అని అడిగారు.

నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని... అవినీతిని నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉరి తీయాలంటూ వైసీపీ అధినేత జగన్ అంటున్నారని... ఆయనలాగా రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకున్నారా? అని ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి నాలుగేళ్ల క్రితమే బయటకు ఎందుకు రాలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇంతకాలం ఓపిక పట్టామని అన్నారు. 
Ayyanna Patrudu
manikyala rao
Pawan Kalyan
jagan
Chandrababu

More Telugu News