sania mirza: నేను అమ్మను అవుతున్నానోచ్!: సానియా మీర్జా

  • ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని పంచుకున్న సానియా
  • వెల్లువెత్తుతున్న అభినందనలు
  • గ్రీటింగ్స్ చెప్పిన షారుఖ్, అమీర్
ఇండియన్ ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా తనే తెలిపింది. తమ జీవితంలోకి ఒక బేబీ రానుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ పోస్టుకు తోడుగా ఒక ఆసక్తికరమైన ఫొటోను జత చేసింది. ఇటు సానియా, అటు షోయబ్ మాలిక్ ల దుస్తులు ఉండగా... మధ్యలో మీర్జా-మాలిక్ పేరుతో చిన్న డ్రెస్ ఉంది. మరోవైపు 'బేబేమీర్జామాలిక్' పేరుతో హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది.

తాను గర్భం దాల్చిన విషయాన్ని సానియా ప్రకటించిన వెంటనే... ఆమెకు శుభాభినందలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
sania mirza
shoib malik
pregnant

More Telugu News