YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ఎల్లోమీడియా దుష్ప్రచారం!: పార్ధసారథి

  • నిన్న జగన్ సీనియర్‌ నేతలతో భేటీ
  • మీడియాలో వస్తోన్న ఈ వార్తల్ని ఖండిస్తున్నాం
  • న్యాయపోరాటం చేస్తాం
  • ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయట్లేదు
వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి నిన్న పార్టీ సీనియర్‌ నేతలతో పాటు రాజీనామా చేసిన ఎంపీలతో సమావేశం అయ్యారని, ఎల్లో మీడియా మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని, అందుకే సమావేశమయ్యారని ప్రచారం చేసిందని ఆ పార్టీ నేత పార్ధసారథి అన్నారు.

మీడియాలో వస్తోన్న ఈ వార్తల్ని తాము తీవ్రంగా ఖండించడమే కాకుండా న్యాయపోరాటం కూడా చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని, ఇటీవల జస్టిస్‌ ఈశ్వరయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈ విషయం స్పష్టమైందని అన్నారు.
YSRCP
parda sarathi
Chandrababu

More Telugu News