yeddyurappa: యెడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు శోభకు అధిష్ఠానం షాక్

  • 225 స్థానాలకు గాను 219 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
  • శోభ కరంద్లాజేకు దక్కని టికెట్
  • ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన శోభ కరంద్లాజేకు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో శోభ పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేడు ఏడు మంది పేర్లతో విడుదల చేసిన నాలుగో జాబితాలో కూడా ఆమె పేరు లేదు. మొత్తం 225 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 219 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ప్రస్తుతం ఆమె చిక్కంగలూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఎంతో పట్టుదలగా ఉన్నారు. అంతేకాదు, పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్  లో శోఖ ఉన్నారు. జగదీష్ శెట్టర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో, తుది జాబితాలో అయినా ఆమెకు టికెట్ లభిస్తుందా? లేదా? అనే విషయంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. 
yeddyurappa
shobha karandlaje
BJP
karnataka
elections
ticket

More Telugu News