yajuvendra chahal: తనిష్క నా స్నేహితురాలు... మేము పెళ్లి చేసుకోవడం లేదు: చాహల్ వివరణ

  • తనిష్కతో పెళ్లి వార్తల్లో నిజం లేదు
  • ఈ విషయంలో వచ్చే వార్తకు చెక్ పెట్టండి
  • నా పెళ్లి వార్తలను పోస్టు చేయడం ఆపండి
తనిష్క కపూర్ తో తన పెళ్లి వార్తలకు చెక్ చెప్పాలని మీడియాను టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ కోరాడు. కన్నడ సినీ నటి తనిష్క కపూర్ తో వివాహం వార్తలపై స్పందించిన చాహల్.. తన ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ పెట్టాడు. దాని వివరాల్లోకి వెళ్తే... ‘ప్రతి ఒక్కరికీ హలో, నా పెళ్లి వార్తలకు సంబంధించి వస్తున్న వార్తలపై ఈ మెసేజ్‌ పెడుతున్నాను. తనిష్కతో నా పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఆమె నా స్నేహితురాలు మాత్రమే.

ఈ సందర్భంగా నేను మీడియాను, అభిమానులను ఒకటే కోరుతున్నారు. ఈ వార్తలకు ఇంతటితో చెక్‌ పెట్టేయండి. ఇంకా దీన్ని వైరల్‌ చేయొద్దు.  మీరంతా నన్ను గౌరవిస్తారని అనుకుంటున్నా. నా పెళ్లిపై వస్తున్న వార్తలను ఇక పోస్టు చేయడం ఆపండి. ఇలాంటి వార్తలు పోస్టు చేసే ముందు ఒకసారి నిర్థారించుకోవడం ఎంతైనా అవసరం. థాంక్యూ. లవ్‌ యూ ఆల్‌’ అని పేర్కొన్నాడు.  
yajuvendra chahal
Twitter
marriage

More Telugu News