vishal: ఆ రిలీజ్ డేట్ ఖాయం కాలేదు .. త్వరలో ప్రకటిస్తాం: హీరో విశాల్

షార్ట్స్‌లో చూడండి
మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే విశాల్ కథలను ఎంచుకుంటూ ఉంటాడు. అందువలన ఆయన సినిమాలకి అక్కడ మంచి మాస్ ఫాలోయింగ్ వుంది. ఇక తమిళంతో పాటు తెలుగులోను తన సినిమాలు విడుదలయ్యేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అలా తాజాగా తమిళంలో ఆయన చేసిన 'ఇరుంబు తిరై' సినిమాను తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో విడుదల చేయాలనుకున్నాడు.

ఈ లోగా అక్కడి చిత్రపరిశ్రమలోని సమ్మె కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు నిన్నటి నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే చిన్నపాటి మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఇలా జరిగిందనీ .. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇంకా ఖరారు చేయలేదని విశాల్ అన్నాడు. త్వరలోనే విడుదల తేదీని తెలియజేస్తామని చెప్పాడు. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయిక సమంత అనే సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
vishal
samanta

More Telugu News