Rahul Gandhi: వివాదాస్పద నినాదాన్ని అందుకున్న రాహుల్ గాంధీ

  • మోదీ నినాదం... బేటీ బచావ్
  • ఆడపిల్లల్ని బీజేపీ వాళ్ల నుంచి కాపాడండి అనేది తమ కొత్త నినాదమన్న రాహుల్
  • 2019లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారు
మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'బేటీ బచావో' నినాదానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కొత్త నిర్వచనం చెప్పారు. 'ఆడపిల్లల్ని కాపాడండి... బీజేపీవాళ్ల నుంచి రక్షించండి' అని చెప్పిన ఆయన... ఇప్పటి నుంచి ఇదే తమ సరికొత్త నినాదమని తెలిపారు. 'రాజ్యాంగాన్ని కాపాడండి' పేరిట ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

 పారిశుద్ధ్య పనులు వాల్మీకులకు ఆధ్యాత్మిక అనుభవంలాంటివని తన పుస్తకం 'కర్మయోగ్'లో మోదీ పేర్కొన్నారని... దళితులపై మోదీకి ఎంత చిన్న చూపు ఉందో దీంతో అర్థమవుతోందని మండిపడ్డారు. కీలకమైన పదవుల్లో ఆరెస్సెస్ కు చెందిన వ్యక్తులను పెడుతూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని అన్నారు. 2019లో దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. దళితుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు.
Rahul Gandhi
Narendra Modi
beti bachav

More Telugu News