TRS: కాంగ్రెస్ శాసనసభ్యుల అనర్హత చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన టీఆర్ఎస్!

  • కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన హైకోర్టు 
  • దీనిపై అత్యవసర పిటిషన్ దాఖలు
  • విచారణకు స్వీకరించేదీ, లేనిదీ బుధవారం నిర్ణయం
కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. శాసనసభలో అనుచిత ప్రవర్తన, దాడి నేపథ్యంలో వీరిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో, విచారణ అనంతరం వీరి అనర్హత చెల్లదంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీన్ని విచారణకు స్వీకరించేదీ, లేనిదీ ఈ బుధవారం కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. 
TRS
HIGH COURT

More Telugu News