Nara Lokesh: వైసీపీది శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం!: ట్విట్టర్లో విరుచుకుపడ్డ నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ వ్యవహార శైలిని తప్పు బడుతూ ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ చేపడుతున్న నిరసనపై వైసీపీ దాడి చేయడం చూడ్డానికి హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని వైసీపీ పాటిస్తోందని లోకేష్ అన్నారు.

నారా చంద్రబాబు నాయుడిపై దాడి చేయడం ద్వారా వారు (వైసీపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 30న తిరుపతిలో సీఎం చంద్రబాబు దీక్ష చేపడుతున్న విషయం విదితమే. అయితే, ముఖ్యమంత్రి హోదా విషయంలో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అదే రోజు విశాఖపట్నంలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు  ప్రకటించడంతో లోకేష్ ఇలా స్పందించారు.
Go Back to Shorts
Nara Lokesh
YSRCP

More Telugu News