drunk and drive: మద్యం మత్తులో కారుతో యువతుల వీరంగం.. ఒకరి మృతి!

  • కుషాయిగూడలో మద్యం మత్తులో కారు నడిపిన యువతులు
  • ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిపైనుంచి దూసుకెళ్లిన కారు
  • నలుగురు యువతులు ఇంజనీరింగ్ విద్యార్థినులుగా గుర్తింపు
హైదరాబాదులో నలుగురు యువతులు మద్యం మత్తులో కారు నడిపి, ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు. దాని వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని కుషాయిగూడలో ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు యువతులు తప్పతాగి ఓవర్‌ స్పీడ్‌ తో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఆ కారు ఫుట్‌ పాత్‌ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ యువతుల వివరాలు తెలియాల్సి ఉండగా, వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
drunk and drive
engeneering girls
Hyderabad
kushaiguda

More Telugu News