Pawan Kalyan: మరోమారు విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్

  • ఆర్కే, మీ దూషణలను మేము భరిస్తాం
  • టీడీపీ జ్యోతి రత్న, ఆర్కే.. టీడీపీ సంస్కృతి ఏంటి?
  • ప్రధానమంత్రిని తిట్టమని మీకు ఎవరు సలహా ఇచ్చారు?
  • కచ్చితంగా, ఆ సలహా ఇచ్చింది ఆర్కేనే : ‘ట్విట్టర్’ లో పవన్
మీడియాపై కన్నెర్రజేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సదరు మీడియా సంస్థల అధిపతులపై తన ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలను, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే)ను ఉద్దేశిస్తూ పవన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ఏబీఎన్’ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో పవన్ అభిమానులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘ఆర్కే, మీ దూషణలను మేము భరిస్తాం. వాటు టూ డూ? మేము సాత్వికం.. పైగా పవర్ లెస్. మేము బాధపడతాం’ అని ఓ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో..‘టీడీపీ జ్యోతి రత్న, ఆర్కే.. టీడీపీ సంస్కృతి ఏంటి.. పీఎం నుంచి సాధారణ వ్యక్తి వరకూ ప్రతిఒక్కరిని దూషించడమా.. గుడ్ ట్రైనింగ్, కీపిటప్..’ అని విమర్శించారు.

ఇంకో ట్వీట్ లో..‘’ప్రత్యేక హోదా’ సాధించేందుకు టీడీపీ నేతలకు గొప్ప వ్యూహం ఉంది, అత్యంత అసభ్యకరమైన పదజాలంతో ప్రధానమంత్రిని తిట్టమని మీకు ఎవరు సలహా ఇచ్చారు? కచ్చితంగా, ఆ సలహా ఇచ్చింది ఆర్కే నే’ అని ఆరోపించారు.
Pawan Kalyan
andhra jyothy
rk
Telugudesam

More Telugu News