YSRCP: వైసీపీతో మంతనాలు జరుపుతున్న కన్నా లక్ష్మీనారాయణ?
- బీజేపీలో తగిన ప్రాధాన్యమివ్వడం లేదంటున్న కన్నా
- ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తనకు దక్కదని తెలిసి ఆవేదన
- కన్నా వైసీపీలోకి వెళతారంటూ జరుగుతున్న ప్రచారం
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తనకు దక్కదని నిర్ధారించుకున్న కన్నా లక్ష్మీనారాయణ అధిష్ఠానంపై అలక బూనారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులోని నివాసంలో తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని నేతలతో ఈరోజు సాయంత్రం ఆయన సమావేశం కానున్నట్టు కన్నా వర్గీయుల సమాచారం. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, అధ్యక్ష పదవి కూడా తనకు దక్కదని దాదాపు తెలియడంతో నిరాశకు గురైన కన్నా, వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో కన్నా మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.