av subba reddy: ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి.. ఉద్రిక్తత!

  • ఎర్రగుంట్లలో సైకిల్ ర్యాలీపై రాళ్లతో దాడి
  • మంత్రి అఖిలప్రియ అనుచరులే దాడి చేశారన్న ఏవీ
  • నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తత
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీలో మరోసారి కలకలం చెలరేగింది. టీడీపీ నేతలు చేపట్టిన సైకిల్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏవీ సుబ్బారెడ్డిపై అతని ప్రత్యర్థులు రాళ్ల దాడి జరిపారు. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

గత కొంత కాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో వీరి మధ్య వైరం మరింత ముదిరింది. వీరి మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరినీ పిలిపించుకున్న చంద్రబాబు... ఇద్దరూ కలసి సమన్వయంతో కలసి పని చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ, ఈ రోజు మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడితో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
av subba reddy
akhilapriya
cycle rally
stone pelting

More Telugu News