Pawan Kalyan: ఎల్లో మీడియాను బహిష్కరించండి: ‘జనసేన’ పిలుపు

  • టీవీ 9, టీవీ 5, ఏబీఎన్ లను బహిష్కరించండి
  • నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నాయి
  • ‘జనసేన’ ట్విట్టర్ లో పవన్ పిలుపు
‘ఎల్లో మీడియాను బహిష్కరించండి’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  పిలుపు నిచ్చారు. ఈ మేరకు ‘జనసేన’ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘మన తల్లులను, బిడ్డలను, సోదరీమణులను దూషిస్తున్న టీవీ 9, టీవీ 5, ఏబీఎన్ లను బహిష్కరించండి. నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నందుకూ వాటిని మనం బహిష్కరించాల్సి ఉంది. నిస్సహాయురాలైన సోదరిని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు..’ అని పవన్ తన ట్వీట్ లో విమర్శించారు.

కాగా, పవన్ కల్యాణ్ మరికొన్ని ట్వీట్స్ లో .. ‘త్వరలోనే సరదాగా , కాలక్షేపం కోసం “అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !!  ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది.  ప్రోగ్రాం లో సింపుల్ చిట్ చాట్, గాసిప్, ఫొటోస్, వీడియోస్ మొదలైన వాటితో పాటు స్టీమీ అఫైర్స్ కూడా మా సాంబాస్ వరల్డ్ లో ఉంటాయి’ అని పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena

More Telugu News