UP: చికిత్స కోసం వచ్చిన బాలికకు డ్రగ్స్ ఇచ్చి.. అత్యాచారం చేసిన డాక్టర్

  • యూపీలోని ముజఫర్ నగర్ లో జరిగిన ఘటన
  • రెండు రోజుల పాటు బాలికపై దారుణం
  • నిందితుడి అరెస్ట్
చికిత్స కోసం ఒంటరిగా వచ్చిన బాలికపై అత్యాచారం చేసి వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు ఓ డాక్టర్. ఈ దారుణం యూపీలో జరిగింది. ముజఫర్ నగర్ ప్రాంతంలో గత మంగళవారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక చికిత్స కోసం క్లినిక్ వెళ్లగా, ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమె ఆచూకీ లేదు. అనంతరం మగతగా ఉన్న స్థితిలో ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని జిల్లా ఎస్పీ అజయ్ సహ్ దేవ్ తెలిపారు. వైద్యుడు ఆమెకు మత్తు మందులు ఇచ్చి లైంగిక దారుణానికి పాల్పడినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆయన తెలిపారు. నిందితుడైన వైద్యుడ్ని అరెస్ట్ చేశామని, విచారణలో భాగంగా అతడి క్లినిక్ నుంచి అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో మరో దారుణం వెలుగు చూడడం గమనార్హం.
UP
MUZAFAR NAGAR

More Telugu News